రాజంపేట : ఒంటిమిట్ట కోదండరాముని దర్శనం మహాభాగ్యము అని టిడిపి రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. శనివారం శ్రీరామ నవమి సందర్భంగా ఒంటిమిట్ట పర్యటిస్తూ అధికారులకు పలు సూచనలు అందించారు. అనంతరం కోదండ రామ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకం లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా భద్రాది ఒంటిమిట్ట లో శ్రీ రాముని దర్శనం చేసుకోవడం మహా భాగ్యమని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు భద్రత కల్పిస్తూ, దర్శనాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని, మన ఊరి పండుగ మన ఊరి రాముని ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుని ఆంధ్ర భద్రాది లో కొలువై ఉన్న ఉన్న స్వామి వారి కటాక్షం పొందాలని ఆయన కోరారు.
Post Views: 3