మోడల్ పరీక్షలోనూ ప్రథమ స్థానంలో మహిళలే

కడప, 5 ఏప్రిల్ 2025 : కడప బార్ అసోసియేషన్ లో శనివారం నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జ్ మోడల్ పరీక్షకు 40 మంది యువ న్యాయవాదులు హాజరై మోడల్ పరీక్షను రాసినట్లు అందులో మొదటి పదిమందిలో ఎనిమిది మంది మహిళలు అధిక మార్కులు సాధించాలని భారత న్యాయవాదుల సంఘం కడప ఉమ్మడి జిల్లా కమిటీ అధ్యక్షులు సి.సుబ్రహ్మణ్యం వర్కింగ్ ప్రెసిడెంట్ టీ. ఈశ్వర్ ప్రకటించారు. మోడల్ పరీక్ష ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు జరిగింది. మోడల్ ప్రశ్న పత్రాన్ని కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి ప్రధాన కార్యదర్శి చంద్రవదన, ఉపాధ్యక్షులు ఉమాదేవి విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్ష రాయడం పూర్తికాగానే కీ ని విడుదల చేసి సరి చూసుకోగా షేక్ ముస్తఫా 86, సి రాజ్యలక్ష్మి 84, ఏ రాహుల్ 80 మార్కులతో టాపర్స్ గా నిలిచారు. మొదటి పదిమందిలో ఎనిమిది మంది మహిళా న్యాయవాదులు అధిక మార్కులు సాధించిన వారిలో ఉన్నారని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐ ఏ ఎల్ న్యాయవాదులు నాగ సుబ్బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి , వెంకట శివ,ట్రెజరర్ సురేష్ స్పోర్ట్స్ సెక్రటరీ చిన్నయ్య పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp