ఉపాధ్యాయుడు నర్సింహారెడ్డికి ఘన సన్మానం

రాయచోటి : ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు బి. నర్శింహారెడ్డికి గౌరవ అధ్యక్షులు పిసి రెడ్డన్న ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయచోటి ఎంఈఓ బాలాజీ నాయక్, సంబేపల్లి జిల్లా పరిషత్ హెచ్ఎం మడితాడి నరసింహారెడ్డిలు హాజరయ్యారు. బి.నర్శింహారెడ్డికి వృత్తి పట్ల ఆయనకున్న అభిమానం అంకితభావం గురించి కొనియాడారు. జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఆంజనేయులు, రాయచోటి మండల విద్యాధికారి మాట్లాడుతూ సన్మాన గ్రహీత శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సౌఖ్యాలతో అష్టఐశ్వర్యాలతో ప్రశాంతంగా గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు పి.పురుషోత్తమ రెడ్డి, ఎస్ మునిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎండి జక్రియా బాషా, కార్యదర్శులు అస్మత్ బాషా, ఎస్ఎండి గౌస్, లియాఖత్ అలీ ఖాన్, జిల్లా కేంద్రం రాయచోటి అధ్యక్షులు హబీబుర్ రెహమాన్, ఎస్ఆర్పి ఖతిబుద్దిన్, కిషోర్ హెచ్ పీ పెట్రోల్ పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp