కష్టసుఖాల మేలు కలయికే ఉగాది

రాయచోటి : కష్ట సుఖాల మేలు కలయికే ఉగాది పండగ అని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అన్నమయ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని కొత్తపేట బాలికల జూనియర్ కళాశాలలో ఉగాది ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు సవర్ణ బాలాజీ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ సుఖ సంతోషాలతో ఉంటూ, సమస్యలన్నీ తీరిపోవాలని ఆకాంక్షించారు. అన్నమయ్య జిల్లా శాఖ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ మన సంస్కృతిని పరిరక్షించే విధంగా ఉగాది పండుగ జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. రామాలయం గుడి దగ్గర ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు పరశురాం ఆంజనేయులు, జిల్లా సహా అధ్యక్షులు కే నాగేంద్రబాబు, జిల్లా కార్యదర్శి బాలాజీ శ్రీనివాసులు, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ కె వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు కవిత నాగులయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp