రాయచోటి, మార్చి 26 :నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడంలోని సంతృప్తి లభిస్తుందని రాయచోటి మునిసిపల్ చైర్మన్ ఫయాజ్ పేర్కొన్నారు. జరియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రాయచోటిలోని జీనత్ మస్జిద్ వద్ద 45 మంది నిరుపేదలను గుర్తించి వారికి రంజాన్ తోఫా కిట్ల పంపిణీ మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. జరియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో కుటుంబ సభ్యులు ముట్టుకోవడానికి కూడా భయపడే సమయంలో జరియా ఫౌండేషన్ సభ్యులు కరోనా రోగులకు సహాయ సహకారాలు అందించారని ఫయాజ్ తెలిపారు. నిరుపేదలను గుర్తించి వారికి ఈ రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం జరియా ఫౌండేషన్ సభ్యులు ఖిజర్ మాట్లాడుతూ జరియా ఫౌండేషన్ స్థాపించిన 8 సంవత్సరాలు పూర్తయిందని, ఇప్పటివరకు 120మంది సభ్యులతో కలిసి రాయచోటి పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జరియా ఫౌండేషన్ సభ్యులు షబ్బీర్, జీలాన్, రియాజ్, మక్దుమ్, మస్తాన్, మౌలాలి, ఖిజార్, ఫినో బ్యాంక్ నవాజ్, గౌస్, జీనత్ మస్జిద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
