రాయచోటి, మార్చి 23 : నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కొండూరు శ్రీనివాస్ రాజు ఎంపికయ్యారు. ఆదివారం ఉదయం గుంటూరులోని ఎన్జీవో హోమ్ నందు నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ తృతీయ సమావేశంలో ఏకగ్రీవంగా ఈయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొండూరు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ అనునిత్యం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వంతో ప్రాతినిధ్యం చేసి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, ఎన్ టి ఏ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చెరుకూరి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైమారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బివి నాగేశ్వరరావు, అన్ని జిల్లాల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 3