సమైక్యతకు, మతసామర స్యానికి ప్రతీక నీలకంఠరావు పేట దర్గా ఉరుసు అని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేటలోని సద్గురు హజరత్ దర్బార్ అలీషా వలీ రహమతుల్లా అలై బాబా జలీల్ మస్తాన్ వలీ బాబా ఉరుసులో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు, దర్గాలో చాదర్ సమర్పించారు. కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డికి ప్రజలు ఘనంగా, ఆత్మీయ స్వాగతాలు పలికారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, మత సామరస్యం వెళ్లి విరియాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సద్గురు దర్గా స్వామీజీ,సద్గురు దర్గా మాతాజీల మహా సమాధులను వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి దర్శించుకున్నారు.
Post Views: 3