క్రమశిక్షణ, సేవా భావానికి ప్రతీక స్కౌట్

విద్యార్థులలో చిన్ననాటి నుండే క్రమశిక్షణతో పాటు దేశభక్తి, సామాజిక సేవా భావాలను పెంపొందించడానికి బాలభటుల ఉద్యమం( స్కౌట్స్ అండ్ గైడ్స్) తోడ్పడుతుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డు మార్గాన ఉన్న అర్చన కళాశాల నందు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న పెట్రోల్ లీడర్ శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. విద్యార్థులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ పొందిన విద్యార్థులకు శారీరిక దారుఢ్యంతో పాటు బంగారు భవిష్యత్తు సమకూడుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న స్కౌట్ మాస్టర్ లకు, గైడ్ కెప్టెన్లకు సర్టిఫికెట్లను అందజేశారు. అర్చన కళాశాల కరస్పాండెంట్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పీఎం శ్రీ పాఠశాలల నుండి వచ్చిన 250 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానములో 5 రోజులు పాటు ఇస్తున్న శిక్షణకు అవసరమైన అన్ని వసతులను కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, ఏఎస్ఓసి లక్ష్మీకర్, హెచ్ డబ్ల్యు బి నిర్మల, స్కౌట్ మాస్టర్ లు మార్ల ఓబుల్ రెడ్డి, నాగరాజ, గైడ్ కెప్టెన్లు సుజాత, గోవిందమ్మ, స్వర్ణలత, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp