అన్నమయ్య జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకెళ్తే కె.వి పల్లి మండలం మహల్ క్రాస్ టర్నింగ్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు రాయచోటి నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో టాటా ఏసీ పాల వ్యాన్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఢిల్లీ బాబు (33), టి వెంకటేష్ (23) అక్కడకక్కడే మృతి చెందారు. ఇరువురు మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేవీ పల్లి సబ్ ఇన్స్పెక్టర్ వి.చిన్న రెడ్డప్ప తెలిపారు.
Post Views: 2