రాయచోటి, ఫిబ్రవరి 23 :
రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టాటా ఏస్ వాహనం బోల్తా పడి 12 మందికి తీవ్ర గాయాలై నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని టిడిపి నాయకులు మౌర్యారెడ్డి, నిచ్చల్ నాగిరెడ్డి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషమ పరిస్థితిలో ఉన్న వారికి అత్యవసర వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఫోన్ చేసి తెలిపారు.
Post Views: 20