రాయచోటి,
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణము లోని అత్యవసర సమయంలో ఓ గర్భిణీ స్త్రీకి రక్తము అవసరం గాక శ్రీ దీప బ్లడ్ బ్యాంక్ నందు హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ జగన్నాథ్ అనే యువకుడుతో రక్తదానం చేయించి పేషెంట్ వారికి అందించారు. ఈ సందర్భంగా మైనుద్దీన్ మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి ఆపదలో ఉంటే ఈ రోజుల్లో మాకెందుకు అని పక్క నుండి వెళ్లిపోయే రోజులివి. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి ప్రతి ఒక్కరూ రక్తదానం ఇవ్వడానికి ముందుకు రావాలి. అత్యవసర సమయంలో స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన జగన్నాద్ కి మైనుద్దీన్ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.
Post Views: 5