కె.వి.పల్లి మండలం సొరకాయల పేట గ్రామం లోనీ అంగనవాడి టీచర్లతో సమీక్ష సమావేశం అంగనవాడి సూపర్వైజర్ అన్నపూర్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి పదేండ్ల వయసులోపు వారికి వర్తిస్తుందని 18 ఏళ్ల వయసు నిండిన తరువాత సుకన్య సమృద్ధి యోజన వల్ల లబ్ది పొందవచ్చని తెలిపారు. చదువుకి, పెళ్లికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఎస్బిఐ లో ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అంగన్వాడి లోను తల్లితండ్రులతో చర్చించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు.
Post Views: 17