నందమూరి బాలకృష్ణను కలిసిన మండిపల్లి

హైదరాబాద్ :
పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణను ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకం కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల తరబడి తన నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల ఆకట్టుకుని వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారని అయనను కొనియాడారు.

Facebook
X
LinkedIn
WhatsApp