రాయచోటి : రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్, సాహిత్య వ్యవహారాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉర్దూ పండితులు ముహమ్మద్ హాషిమ్, విద్యా పరిరక్షణ సిఫారసుల కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉర్దూ ఉపాధ్యాయులు ఖదీర్ పర్వేజ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్లు హాషిమ్ , పర్వేజ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉర్దూ విద్యాసంస్థల పరిరక్షణకు, విద్యార్థులలో సాహిత్య వికాసానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తమకు రాష్ట్ర కన్వీనర్లు గా ఎన్నుకున్నందుకు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అబ్దుల్ మునాఫ్ ,రాష్ట్ర శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఇక్బాల్, సయ్యద్ ముష్తాఖ్, రాష్ట్ర కోఆర్డినేటర్ ముహమ్మద్ అయ్యూబ్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి అసదుల్లా బాష లకు కృతజ్ఞతలు తెలిపారు.
