ప్లాస్టిక్ నిర్మూలనలో వెనుకబడిన రాయచోటి ?

రాయచోటి :
రాయచోటిలో ప్లాస్టిక్ ను నిర్మూలించడంలో మునిసిపల్ అధికారులు విఫలమైనారని ప్రజలు వాపోతున్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా వాటర్ ప్యాకెట్లను మునిసిపల్ అధికారులు రద్దు చేశారు. అయినా వాటర్ ప్లాంట్ యాజమాన్యాలు వాటర్ ప్యాకెట్లను చాటుగా తయారు చేస్తూ రాయచోటిలోని పెద్దపెద్ద రెస్టారెంట్లు, బార్లు, వైన్ షాపులకు చాటుగా అమ్మేస్తున్నారు. వాటర్ ప్లాంట్ యాజమాన్యాలు ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా నీళ్లను యదేచ్చగా అమ్ముకుంటూ ప్రజల డబ్బును సొమ్ము చేసుకుంటూ, ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లను మునిసిపల్ అధికారులు తనిఖీలు చేయడంలో విఫలమయ్యారని ప్రజల విప్రాయపడుతున్నారు. అదే కాకుండా రాయచోటి లోని కొన్ని హోటల్లలో, దుకాణాలలో, మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు యదేచ్చగా అమ్ముతున్నారు. రాయచోటిలో ప్లాస్టిక్ ఎక్కడపడితే అక్కడ రోడ్లపై పడి పర్యావరణం మరింత కాలుష్యం అవుతోంది. పై స్థాయి అధికారులు స్పందించి ప్లాస్టిక్ రహిత రాయచోటిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp