కలికిరి ; హజరత్ సయ్యద్ యూసుఫ్ అలీ బాద్షా 142వ ఉరుసు ఉత్సవంలో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి ఆదివారం రాత్రి పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం మహాల్ గ్రామంలోని హజరత్ సయ్యద్ యూసుఫ్ అలీ బాద్షా 142వ ఉరుసు ఉత్సవం ఏపి సున్నీ మసాయిక్ బోర్డు వ్యవస్థాపకులు హజరత్ సయ్యద్ షా జకావుద్దీన్ హుస్సేనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవంలో ముఖ్యఅతిథిగా కడప అమీన్ పీర్ పెద్ద దర్గా పీఠాధిపతి సజ్జదే నశిన్ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుస్సేనీ చిస్తిల్ ఖాద్రీ హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కలికిరి మండలం గడి గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీఎ కమిషనర్ సయ్యద్ ఖతీబ్ ఆఘా మోహియుద్దీన్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏటా మహాల్ గ్రామంలో అత్యంత వైభవంగా హజరత్ యూసుఫ్ అలీ బాద్షా ఉరుసు ఉత్సవం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నై కి చెందిన గురువు సయ్యద్ ఫిదాల్ హువా ఆమిరి,కడప కు చెందిన సయ్యద్ షా తమీమ్ బుకారీ,షిరాజ్ బుకారీ,కలిచెర్ల కె.ఎస్.ఎస్ మక్దూమ్ అష్రఫ్ హుస్సేనీ,సయ్యద్ షా నిజాముద్దీన్ ఖాద్రీ, ఐఆర్ పల్లికి చెందిన సయ్యద్ లతీఫ్ ఉద్దీన్ అహ్మద్ హుస్సేనీ, షేక్ మెహబూబ్ భాష తదితరులు పాల్గొన్నారు.
ఉరుసు ఉత్సవాలకు హాజరైన సయ్యద్ షా జకావుద్దీన్


Post Views: 26
Facebook
X
LinkedIn
WhatsApp

