సీఎంకు ఘన స్వాగతం పలికిన పులివర్తి నాని

కుప్పం : చిత్తూరు జిల్లా,కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12.05 గంట కు గుడుపల్లి మండలం,ద్రావిడ యూనివర్సిటీ ఇందిరా గాంధీ స్టేడియం నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పుష్పగుచ్చం శాలువాతో ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పతకాల, మొన్న నారావారిపల్లి గ్రామంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా వంటి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే పులివర్తి నాని వివరించారు. నారావారిపల్లి గ్రామంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలోసుమారు 21 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో 1,200 ఉద్యోగాలకు గాను సుమారు 689 మందికి ఉద్యోగం అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే పులివర్తి నాని వివరించారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp