మదనపల్లె: మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు
మదనపల్లెలోని బెంగుళూరు బస్టాండు వద్ద మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తనపై దాడి చేశారని ప్రైవేట్ బస్సు కండక్టర్ హరినాథ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. బాధితుడి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే, అనుచరులపై కేసు నమోదు చేశారు. అనంతరం నవాజ్ బాషాను పోలీస్ స్టేషన్కు పిలిపించి 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు సీఐ రామచంద్ర తెలిపారు.
Post Views: 0