బిజెపిలో చేరడం రాష్ట్రానికి ముస్లిం సమాజానికి తీరని ద్రోహం

రాజంపేట : శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం బీజేపీ లో చేరి అటు వైస్సార్సీపీ కి మరియు ముస్లిం సమాజానికి తీరని ద్రోహం చేసారని వైస్సార్సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జాహిద్ అలీ తెలిపారు. 2019 ఎన్నికల ముందు ముస్లిం ల అధికంగా ఉన్న రాయచోటి నియోజక వర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముస్లిం సామజిక వర్గానికి సంబందించిన వారికీ టికెట్ కేటాయించాలని వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారిని ముస్లిం సోదరులు కోరగ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కి మాట ఇచ్చానని పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే ముస్లిం సామజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తానని మాటివ్వడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన దానికన్నా ఎక్కువగా శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా నియమిస్తే కనీసం కృతజ్ఞత భావం లేకుండా తన స్వార్ధ రాజకీయాలకోసం బీజేపీ పార్టీ లో చేరి అటు పార్టీ కి ఇటు ముస్లిం సమాజానికి తీరని నష్టం చేకూర్చారని తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp