రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని నేతాజీ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ హైస్కూల్లో రీ అపార్ట్మెంట్ జీవో నెంబర్117 సవరణలో భాగంగా పోస్టులు అసంబంధంగా కేటాయించారు. గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేతాజీ సర్కిల్ రాయచోటి నందు విద్యార్థిని విద్యార్థులు ఉర్దూ ప్రధమ భాషగా ఎంచుకొని ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్నారు కానీ ఉన్నపలంగా స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ పోస్టును సర్ప్లస్గా చూపించడం జరిగిందని, అక్కడ సంస్కృతం భాషను చదివే విద్యార్థులు లేరు కానీ స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం పోస్టును కేటాయించారు. ప్రస్తుతం ఈ అసంబద్ధ కేటాయింపు వలన ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఉర్దూ భాషను ప్రథమ భాషగా చదువుచున్న విద్యార్థిని విద్యార్థులు నష్టపోతున్నారు. దయచేసి పై విషయంపై సంబంధిత అధికారులు చొరవ తీసుకొని స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం పోస్టుకి బదులు స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ పోస్టును కేటాయించి విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తును కాపాడి న్యాయం చేయాలని తల్లిదండ్రులు, పలు ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
