పీలేరు మండలం నందు ఎన్ హెచ్ ఎస్ రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్న విషయం విధాతమే. అయితే ఎంతో ఆశగా భూమి యజమానులు నీటి బోరు నీ వేసుకోగా నీరు పడ్డాయి అని సంతోషపడేలోపే ఎన్ హెచ్ ఎస్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా బోర్ ని మూసివేసి అందుకైన ఖర్చుని భూ యజమానులకు చెల్లిస్తామని మాట చెప్పడంతో చేసేది ఏమీ లేక ప్రభుత్వానికి భూమిని అప్పజెప్పడం జరిగింది. ఈ తరుణంలో ఎన్ని రోజులైనా తమకి ఎన్ హెచ్ ఎస్ వారు ఇంటి స్థలాలకు మాత్రం డబ్బు చెల్లించారు కానీ నీటి బోరు నష్టపోయిన వారికి డబ్బు చెల్లించకపోవడంతో భూమి యజమానులు విలేకరుల సమక్షంలో ఆవేదనను వ్యక్తం చేశారు వెంటనే తమ సమస్యని ప్రభుత్వం యంత్రాంగం పరిష్కరించాలని భూమి యజమానులు ప్రభుత్వాన్ని కోరారు.
Post Views: 1