చమర్తి ఆధ్వర్యంలో పల్లా పుట్టినరోజు వేడుకలు

రాజంపేట : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో భారీ కేకులు కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా విశేష సేవలు అందిస్తున్నారని,తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్త ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని దానికి నిదర్శనమే పల్లా శ్రీనివాసరావని, ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవ్వాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఆయన సేవలు అసమాన్యం రాజకీయ జీవితం ఎందరికో మార్గదర్శకం అని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. నాయకులు కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp