రైల్వే కోడూరు : టీడీపీ ఇంచార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి జన్మదిన, వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, వారి నివాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు ముక్కా దంపతులకు వేద ఆశీర్వదించి, వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని దీవించారు.అనంతరం ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, ముక్కా విశాల్ రెడ్డి, వారి సతీమణి రిషిక రెడ్డి, ముక్కా సాయి వికాస్ రెడ్డి, వారి సతీమణి శిరీష రెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో జన్మదిన, వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ముక్కా రూపానంద రెడ్డి సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ పలువురు ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 3