ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా

రాయచోటి : ప్రజల, బాటసారుల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షులు పగిడిపల్లి పకీర్ సాహెబ్, రాష్ట్ర ఉద్యోగస్తుల అధ్యక్షులు పగడాల సిద్దయ్యలు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాసాపేట నూరుబాష్ దూదేకుల ముస్లిం సేవా సంఘం కార్యాలయం ఎదుట చలివేంద్రాన్ని వీరు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగూరు రెడ్డి భాష వర్షన్ డిపార్ట్మెంట్, అన్నమయ్య జిల్లా ఎంప్లాయిస్ ప్రధాన కార్యదర్శి ఇలియాస్ టీచర్లు విచ్చేశారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొండూరు మహమ్మద్ షఫీ, వెండికట్ల ఇనాయతుల్లా, అడవికాళ్ళ సత్తార్, కౌన్సిలర్ భాష, నాగరాజా, పాలగిరి దర్బార్ భాష, చెప్పలి పీరు సాహెబ్, ఫకీర్ సాహెబ్, టీచర్ చిలకల మహమ్మద్ అలీ, రహమతుల్లా,పగిడిపల్లె అల్లా బకాష్, తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp