చిన్నమండెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిన్నమండెం మండలం, బోరెడ్డి గారిపల్లెలోని తమ నివాసం నందు మంత్రి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ ప్రజలు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే వారిని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులమత, ప్రాంత బేధాలు లేకుండా పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటికే తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నిరంతరం ప్రజాసేవకే తన సమయాన్ని కేటాయించి ప్రజల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. బాధితుల అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే వారి సమస్యలు పరిష్కరించడం జరిగింది.
Post Views: 5