విందు కార్యక్రమానికి నిచ్చల్ నాగిరెడ్డి

చిన్నమండెం : రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనయుడు టిడిపి యువ నాయకులు నిచ్చల్ నాగిరెడ్డి గురువారం రాత్రి అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం, మల్లూరు కస్పా నందు అల్లం మహేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు వారింట్లో విందు భోజనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మల్లూరు కస్పా ప్రజలు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు సమస్యల గురించి మల్లూరు కస్పా ప్రజలు ఆయనకు వివరించారు. ఈ సమస్యలను మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp