ఆడబిడ్డ వివాహానికి జిన్నా ఆర్థిక సహాయం

రాయచోటి: సహాయం కావాలని ఆర్థించిన వెంటనే మేము ఉన్నామంటూ ఆదుకునే మొట్టమొదటి సేవా సంస్థ జిన్నా సేవా సంస్థ. అన్నమయ్య జిల్లా చిన్నమండెం కు చెందిన పేద కుటుంబ యజమాని పెయింటర్ పనిచేసుకుంటూ తన జీవనం సాగించేవాడు. కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో ఆర్థిక సమస్యతో బాధపడుతున్న యజమాని తన సమస్యను జిన్నా సేవా సంస్థకు వివరించగా వెంటనే స్పందించిన జిన్నా సేవా సంస్థ అధ్యక్షులు జిన్నా షరీఫ్ వివాహానికి కావాల్సిన బియ్యం సరుకులు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. జిన్నా సేవా సంస్థకు యజమాని కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Facebook
X
LinkedIn
WhatsApp