రాయచోటి : అన్నమయ్య జిల్లా ను మత సామరస్యానికి ప్రతీకగా పెంపొందించుకుందామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. జిల్లాలో జరగబోయే అన్ని మతాలకు సంబందించిన కార్యక్రమాలు, ప్రార్థనలు, ఊరేగింపులలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిశ్రద్ధలతో, సహుద్భావ వాతావరణంలో, ఒకరికి ఒకరు సహకరిస్తూ, ఒకరి మత విశ్వాసాలను మరొకరు గౌరవిస్తూ, శాంతియుత వాతావరణంతో పండుగలు జరుపుకోవాలని అన్నారు. అన్నిమతాల వారు, వారి వారి మత కార్యక్రమాలను భక్తి శ్రద్దలతో సంతోషంగా జరుపుకోవడానికి పోలీసులు చేస్తున్న సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. శాంతి భద్రతలను కాపాడుకునేందుకు పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. అన్నమయ్య జిల్లాను మతసామరస్య జిల్లాగా తీర్చిదిద్దు కుందామని జిల్లా ఎస్పీ తెలిపారు.
Post Views: 2