మదనపల్లి : మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు సంరక్షకులపై కేసులు నమోదు చేస్తామని మదనపల్లి డి.ఎస్.పి కొండయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న 26 మంది మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి కేసు నమోదు చేసామన్నారు. ముదివీడు పోలీస్ స్టేషన్ పరిధి అంగళ్లలోని స్కూళ్లు, కళాశాలల పరిధిలో, చిల్లర దుకాణాలు, పీజీ హాస్టల్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. పొగాకు మత్తు కలిగించే వాటిని సీజ్ చేసి, 13 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశామన్నారు. విద్యార్థులకు చెడు వ్యసనాలకు గురి చేస్తున్నారని సమాచారం రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి రూరల్ సీఐ సత్యనారాయణ, ముదివీడు ఎస్ఐ దిలీప్, పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు
