బాధితునికి ముక్క వరలక్ష్మి ఆర్థిక సహాయం

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎక్కడ , ఎవరికి కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ అండగా ముక్కా ఫౌండేషన్ నిలుస్తోంది. కడప అర్బన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్, రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానంద రెడ్డి ముక్క ఫౌండేషన్ పేరిట నియోజకవర్గంలో కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆపన్నుల పాలిట ఆపద్భాందవిగా నిలుస్తోంది. కోడూరు మండలం మాధవరంపోడు గ్రామంలో, రోడ్డు ప్రమాదంలో గాయపడి పూర్తిగా మంచానికే పరిమితమై, జీవనానికి ఇబ్బందులు పడుతున్నరాఘవ సుబ్బరాజు కుమారుడు రాఘవ నాగేంద్ర రాజు అనే నిరుపేద వ్యక్తి కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయాన్ని ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

మీ పరిసర ప్రాంత వార్తలను మా దృష్టికి తీసుకురావాలంటే 9966319992కి పంపండి

Facebook
X
LinkedIn
WhatsApp