రాయచోటి, మార్చి 25 :
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాసాపేట సుగవాసి రాజారామ్ హైస్కూల్ ప్రక్కన వెలిసిన శ్రీ మహేశ్వరి మల్లాలమ్మ దేవస్థానం మార్చి 28న శుక్రవారం జరిగే 17 వ వార్షికోత్సవ కార్యక్రమానికి మేదర సంఘం సభ్యులు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబుకు ఆహ్వాన పత్రికను అందించారు. మంగళవారం రోజు రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా మేదర వెంకటేశ్వర్లు, సంఘం సభ్యులు కలిసి వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను ప్రసాద్ బాబుకి అందజేసి, పుష్పగుచ్చంతో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
Post Views: 3