రాజంపేట, మార్చి 23 : రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటం మండలం, మాచుపల్లి గ్రామ గ్రామనివాసి మల్లు వెంకటసుబ్బారెడ్డి శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా ఆదివారం మల్లు వెంకటసుబ్బారెడ్డి ఏర్పాటుచేసిన ప్రత్యేక విందు కార్యక్రమానికి రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విందు అనంతరం రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం మల్లు వెంకట సుబ్బారెడ్డిని శాలువాతో సత్కరించి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 3