పోలీసు లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు

రాయచోటి మార్చి 22: లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో బొమ్మన బోయిన ముకుందర (41) కానిస్టేబుల్ మృతి పట్ల అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కానిస్టేబుల్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అంకితభావంతో పనిచేసే సిబ్బంది అకాలమరణం పొందడం బాధాకరమన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్వగ్రామం వీరబల్లి మండలం ఆమూరువాండ్లపల్లెలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీ.వీ.కొండారెడ్డి, లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ, డి.రవీంద్రబాబు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. పోలీసు లాంఛనాలతో, ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసులు తుపాకులతో గాలిలోకి కాల్పులు జరిపి అంతేకాని నిర్వహించారు. మృతునికి భార్య, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీసు శాఖ అండగా ఉంటుందని తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp