*వంద ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటుకు కార్యాచరణ
*12 కోట్లలో సిసి రోడ్లు పూర్తి,మరో పది కోట్లకు ప్రతిపాదనలు
*ఐదేళ్ల వైఖపా పాలన 20 ఏళ్ల అభివృద్ధిని వెనక్కి నెట్టింది
*మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వ్యాఖ్యలు
మదనపల్లి, మార్చి 22 : నియోజకవర్గం అభివృద్దే ఎజెండాగా అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించినట్లు, మదనపల్లి పట్టణంలో వంద ఎకరాల్లో ఐటీ పార్కును అభివృద్ధి చేయడానికి బాధ్యతలు చేపట్టడం జరిగిందని మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ 26 రోజులు పాటు జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్,అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు,విద్య,ముస్లిం మైనార్టీల సమస్యలపైన సమగ్రంగా మాట్లాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి, మంత్రి, స్పీకర్ తమకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మదనపల్లి నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా,సొంత ఎజెండా ఏమీ లేకుండా తాము పనిచేస్తున్నామన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను పూర్తి బాధ్యతతో పని చేస్తున్నామన్నారు.మొదటి సారిగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం రోడ్లు విస్తరణ చేయాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. ఉమ్మడి జిల్లాలలో స్విమ్స్,రుయా ఆసుపత్రుల తర్వాత మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రికే ఎక్కువమంది రోగులు వైద్యం కోసం రావడం జరుగుతుందని గుర్తు చేశారు.కావున మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశానికి జాతీయ గీతాన్ని అందించడమే కాకుండా లక్షలాది మందిని విద్యావంతులుగా చేసిన దివ్యజ్ఞాన కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.నియోజకవర్గంలో నిమ్మనపల్లి – రామసముద్రం మండలాలకు రోడ్లు విస్తరణ,టమోటో ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు,మదనపల్లి పరిసరాల్లో వంద ఎకరాల్లో ఐటి పార్కుకు భూమి సేకరించి ఎంఎస్ఎంఈ క్రింద అభివృద్ధి చేయడానికి బాధ్యతలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణ పరిసరాల్లో డికెటి భూములు కాపాడటం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో కోరామని తెలిపారు.కోళ్లబైలు కాలనీలో సుమారు 5 వేల మంది ప్రజలు నివాసం వుంటున్నారని,వారికి రోడ్లు,త్రాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.ఇప్పటికే ఎన్ఆర్ ఈజిఎస్ క్రింద 12 కోట్లతో రోడ్లు వేశామని,మరో పది కోట్లతో రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టడం జరిగిందన్నారు.మైనార్టీల వక్ఫ్ ఆస్తులను,ఎండోమెంట్ ఆస్తులను అన్యాక్రాంత్రం చేస్తే పిడి యాక్ట్ క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.త్వరలో నే మదనపల్లి జిల్లా రాబోతొందని,అలాగే మదనపల్లికి మహర్థశ వస్తోందని ప్రకటించారు.మునిసిపాలిటీలో ఈనెల ఆఖరుకు సిఎఫ్ఎంఎస్ కు ప్రభుత్వం స్వస్తి పలుకుతోందని వివరించారు.నియోజక వర్గంలో గడిచిన 10 సంవత్సరాల వైసిపి పాలనలో అభివృద్ధి 20 ఏళ్ల వెనక్కు వెళ్లిందని విమర్శించారు.రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్.జె.వెంకటేష్,ది మదనపల్లి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్,టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ మరియు బాలు స్వామిలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్తోందని స్పష్టం చేశారు.ఎన్ఆర్ఈజీఎస్ క్రింద రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సూపర్ సిక్స్ పథకాలను విడతల వారీగా అమలు చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చుతోందన్నారు.రానున్న మే నెలలో తల్లికి వందనంతోపాటు రైతు భరోసా నిధులు అర్హుల ఖాతాల్లో జమ చేయడమే కాకుండా,జిల్లాల పరిధిలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతొందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సిటిఎం మాజీ సర్పంచ్ రెడ్డి రాంప్రసాద్, టిడిపి నాయకులు ముసలికుంట నాగయ్య, బొమ్మిశెట్టి పురుషోత్తం, యర్రబల్లి వెంకటరమణారెడ్డి, డాన్స్ రెడ్డెప్ప, షంషీర్, బెల్లె రెడ్డి ప్రసాద్, మండిపల్లి మధుసూదన్ రెడ్డి, జేసీబి వేణు, బిల్డర్ రామకృష్ణ, కత్తి లక్ష్మన్న, చల్లా నరసింహులు, బోనాసి జాన్ బాబు, రాటకొండ శ్రీనివాసులు నాయుడు, ప్రభాకర్, బాబు నాయుడు, పూల మురళి, టిఎన్టియుసి ఖాసిం, చెండ్రాయుడు, దుబ్బిగాళ్ల భాస్కర్, జంగాల వెంకటరమణ, రైస్ మిల్ శశి కుమార్, చిన్నమహేష్, రాజేష్, మంజునాథ్, ముద్దుకృష్ణమ నాయుడు, సాయి, హసీనా, శ్యామలమ్మతోపాటు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
మదనపల్లి అభివృద్దే అజెండా – ఎమ్మెల్యే షాజహాన్


Post Views: 3
Facebook
X
LinkedIn
WhatsApp

