సూపర్ కె ప్రారంభోత్సవంలో లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

రాయచోటి, మార్చి 21 : వినియోగదారులకు నాణ్యతతో కూడిన నిత్యవసర సరుకులను సరసమైన ధరలకు అందించి వారి మన్నలను పొందాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని సుండుపల్లి రోడ్డు మార్గంలో హరీష్ చంద్ర నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ కే మార్కెట్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ని సదా స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. యువత వ్యాపార రంగాలపై మక్కువ చూపించడం చాలా అభినందనీయమని, వచ్చే వినియోగదారులకు గౌరవ మర్యాదలతో నాణ్యమైన సేవలు అందించాలన్నారు. వినియోగదారుల మండలం పొందుతూ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈయన వంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp