లక్కిరెడ్డిపల్లె, మార్చి 19 :
రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి జన్మదినం సందర్భంగా లక్కిరెడ్డిపల్లె మండల నాయకులు మదన్మోహన్ ఆధ్వర్యంలో బుధవారం లక్కిరెడ్డిపల్లె మండలంలోని టిడిపి కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ల జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని మదన్మోహన్ తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేయడం జరిగిందన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మదన్మోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Post Views: 5