ఆంధ్రప్రదేశ్ గురుకుల ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశ ఆహ్వానం

కె.వి పల్లి మండలం, గ్యారంపల్లి గురుకుల జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్ నందు 60 సీట్లు బైపిసి గ్రూపు నందు 40 సీట్లు ఎం ఇ సి గ్రూప్ నందు 30 సీట్లు ఉన్నవని ప్రిన్సిపల్ చెన్నకేశవులు తెలిపారు. ఈ కళాశాలలో చేరుటకు 2024-25 విద్యా సంవత్సరంలో ఉమ్మడి చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైయస్సార్, నంద్యాల మరియు కర్నూలు జిల్లాలలో పదవ తరగతి పరీక్ష రాసి పాస్ అయిన బాలుర విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు. (aprs apcfss.in) వెబ్సైట్ నందు 300 రూపాయలు ఫీజు చెల్లించి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసి దరఖాస్తును ప్రింట్ తీసి ఉంచుకోవాలి. అని ప్రిన్సిపల్ చెన్నకేశవులు తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp