నిస్వార్ధ సేవకు మారుపేరు లయన్స్ క్లబ్ ఆఫ్ టౌన్

నిస్వార్థ సేవకు మారుపేరుగా లయన్స్ క్లబ్ నిలుస్తుందని డిస్టిక్ గవర్నర్ పీఎంజేఎఫ్ లయన్ గౌతమ్ పేర్కొన్నారు. ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో వెంకటేశ్వర హైస్కూల్లో తిరుపతి అరవింద కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకు బట్టలు పంపిణీ చేసామని అధ్యక్షులు లయన్ పి.శివారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ పి.ఎం.జె.ఎఫ్ లయన్ గౌతమ్ మాట్లాడుతూ జోన్ 12లో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ సేవలు ముందంజలో ఉందని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కంటి వైద్య శిబిరం, బట్టల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించినందున చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాతలు లయన్ ఆంజనేయరెడ్డి,లయన్ మిక్కిలినేని ప్రసాద్ నాయుడు,రిటైర్డ్ ఎస్బిఐ ఆఫీసర్ చిత్తూరు నివాసి సుబ్రమణ్యం శెట్టి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రజలందరికీ అన్నదానం చేసి వృద్ధాశ్రమంలో బట్టణ పంపిణీ చేయడం రాబోవు రోజుల్లో కూడా మా వంతు సహాయ సహకారాలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు, రామాపురం మండల నాయకులు,ఆశ్రమం సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp