రాయచోటి,
చిన్నమండెం మండలం, మల్లూరు కొత్తపల్లి గ్రామంలో మార్చి 13, 14 వ తేదీలలో జరుగు మల్లూరమ్మ దేవత తిరుణాల పోస్టర్ ను శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో రాయచోటి నియోజకవర్గం టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. మల్లూరమ్మ దేవత తిరుణాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవతో తిరుణాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ఘనంగా నిర్వహించనున్నారన్నారు. 13వ తేదీ నిండు తిరుణాల, 14న మైల తిరుణాల ఉంటుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్న సందర్భంగా 13వ తేదీ రాత్రి 8 గంటలకు నెల్లూరు మాధవ్ ఈవెంట్స్ వారిచే గొప్ప ఆర్కెస్ట్రా, జబర్దస్త్, మరియు డీజే డ్యాన్స్, చెక్కభజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరుణాల మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
మల్లూరమ్మ తిరుణాల పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీ ప్రసాద్ రెడ్డి


Post Views: 4
Facebook
X
LinkedIn
WhatsApp

