ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(APUS) అన్నమయ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాయచోటి నగరంలోని పలువురు మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎం నరసింహులు మాట్లాడుతూ భారతీయ మహిళలు ప్రపంచంలోనే ఎప్పుడూ ఉన్నతమైన ఆలోచనలతో ఓర్పు సహనం అంకితభావం మొదలైన గుణాలను కలిగి ఉంటారని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి టి మధుమతి మాట్లాడుతూ ప్రతి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ధైర్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు కవిత తదితర కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post Views: 2