రూట రాష్ట్ర కన్వీనర్ గా రహమతుల్లా

రాయచోటి, ఫిబ్రవరి 22 :
రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్, విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మార్కెట్ ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సయ్యద్ రహమతుల్లా బాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ రహమతుల్లా బాషా మాట్లాడుతూ రూట సంఘ బలోపేతానికి ,ఉర్దూ విద్యాసంస్థల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఇక్బాల్, సయ్యద్ ముష్తాఖ్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి అసదుల్లా బాష లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‎

Facebook
X
LinkedIn
WhatsApp