మౌర్యరెడ్డి పాదయాత్రలో నిచ్చల్ నాగిరెడ్డి

కె.వి పల్లె, ఫిబ్రవరి 17:-
రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు మౌర్యరెడ్డి చేస్తున్న పాదయాత్రకు మంత్రి కుమారుడు నిచ్చల్ నాగిరెడ్డి సంఘీభావంగా సోమవారం కె.వి పల్లె మండలం, పించా సమీపంలో మౌర్యరెడ్డిని కలిసి పూలమాలతో సన్మానించారు. టిడిపి నాయకులు మౌర్యారెడ్డి చేపట్టే పాదయాత్రకు వేలాదిమంది టిడిపి నాయకులు, ప్రజలు ఆయన వెంట పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించారు.

Facebook
X
LinkedIn
WhatsApp