రాష్ట్ర కార్యదర్శిగా నవాజ్ క్రిష్ నియామకం

రాయచోటి : ముస్లిం ఐక్యవేదిక కార్మిక విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి చెందిన నవాజ్ క్రిష్ ను నియమించారు. ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ జాఫర్ అలీ చేతుల మీదుగా నవాజ్ క్రిష్ నియామకపత్రాన్ని అందుకున్నారు. ముస్లిం కార్మికుల కోసం పని చేస్తున్న సంస్థలో తన వంతు కృషి చేస్తూ సలహాలు, సహకారాలు అందిస్తూ ఈ భాధ్యత ను విజయవంతంగా నిర్వహిస్తారని ముస్లిమ్స్ కార్మిక అభ్యున్నతకు తోడ్పడుతానని నవాజ్ క్రిష్ తెలిపారు. నన్ను ముస్లిం ఐక్యవేదికలో పాలుపంచుకునేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నవాజ్ క్రిష్ తెలిపారు.

Facebook
X
LinkedIn
WhatsApp