భోగాంజనేయ బ్రహ్మోత్సవాల్లో బాలసుబ్రమణ్యం

రాజంపేట : అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కుంపిణీపురం గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ భోగాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజంపేట నియోజక వర్గ టీడీపీ ఇంఛార్జి సుగవాసి బాల సుబ్రమణ్యం ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున మేల తాళాలతో, బాణసంచా పేలుస్తూ, పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. వేద పండితులు వేదమాంత్రాలతో స్వామివారి శాలువా వేసి పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కూటమి (ఎన్డీఏ)పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp