కె.వి పల్లి మండలం,కిస్సా పల్లి లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్ర నాయక్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఉలవబంటును పరిశీలించి దిగుబడి అంచనా వేసి రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు. రైతులు జాతీయ చీడ పీడల నిఘవ్యవస్థ యాప్ గురించి తెలుసుకోవాలని దీని ద్వారా పంటలకు ఆశించిన చీడపిడ నివారణను తీసుకోవాల్సిన చర్యలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఈ యాప్ పై రైతు సేవా సిబ్బంది రైతులకు తెలియజేయాలని సూచించారు. ఈ క్రాప్ లో నమోదు చేసిన ప్రతి పంటకు రైతు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించి రైతు సేవ కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీలేరు సహాయ వ్యవసాయ శాఖ సంచాలకులు వైవి రమణారావు, కె.వి పల్లి మండల వ్యవసాయ శాఖ అధికారిని యూ శ్రావణి, వ్యవసాయ విస్తరణ అధికారులు ఇంద్రసేనారెడ్డి, అనిత దేవి, రైతు సేవ కేంద్రం సిబ్బంది అర్చన, కిరణ్, మౌనిక మరియు రైతులు పాల్గొన్నారు
Post Views: 20