గణాంకాలు పథకాల అమలు మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో కడప జాతీయ గణాంకాల సిబ్బంది శ్రామిక, ఉద్యోగిత, నిరుద్యోగిత సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా గణాంకాల సిబ్బంది మాట్లాడుతూ ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో శ్రామికుల ఉద్యోగ నిరుద్యోగుల అంచనా కోసం ఈ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా గత 2 రోజులుగా అన్నమయ్య జిల్లా లోని కె.వి. పల్లె మండలంలోని గ్యారంపల్లి రెవిన్యూ విలేజ్ లో గణంకాల సిబ్బంది సర్వే ఎనిమరేటర్స్ వి.మల్లికార్జున, ఎస్ కొల్లయ్య సర్వే చేశారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ మాకు సహకరించి, సరైన సమాచారాన్ని ఇచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు.
Post Views: 38