ఏటీఎంలు ఖాళీ – ఇబ్బందుల్లో ప్రజానీకం

పీలేరు : అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో ఎస్బిఐ ఎటిఎం మిషన్లు 10 ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే పీలేరులో 10 ఎస్బిఐ ఎటిఎం మిషన్లు ఉదయం నుంచి పని చేయక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏటీఎం కి అర్థం “ఎనీ టైం మనీ కాదు” ఎనీ టైం ఖాళీ మిషన్లో అంటూ ప్రజలు వాపోయారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఎస్బిఐ అధికారులకు తెలిపిన ఫలితం లేదంటూ ప్రజలు వాపోయారు. ఇకనైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల అవసరాలు తీసుకుని ఎస్బిఐ ఏటీఎంలలో డబ్బులు ఉంచాలని ప్రజల ఎస్బిఐ అధికారులను వేడుకుంటున్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp