*టిడిపి యువ నాయకులు మౌర్య రెడ్డి
చిన్నమండెం : అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం, మల్లూరు గ్రామంలో మండలస్థాయి క్రికెట్ టోర్నమెంటును సోమవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు టిడిపి యువ నాయకులు మౌర్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మౌర్య రెడ్డి మాట్లాడుతూ క్రికెట్ క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి ఓడినవారు రాబోయే ఆటలలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నమండెం మండలంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలలో చిన్నమండెం మండలంలోని క్రీడాకారులందరూ పాల్గొని క్రికెట్ పోటీలను విజయవంతం చేయాలన్నారు. క్రికెట్ పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 25000, రెండవ బహుమతిగా 15000 క్యాష్ మనీ ఇవ్వడం జరుగుతుందన్నారు.
