భారతదేశ మూల సంసృతిని కాపాడుకుందాం

రాయచోటి: సశాస్త్రీయమైన భారతదేశ మూల సంస్కృతిని కాపాడుకుందాం అని భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర కార్యదర్శి పల్లం తాతయ్య కోరారు. భారతీయ అంబేద్కర్ సేన 13 వ వార్షికోత్సవం సందర్బంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి లోని అంబేద్కర్ విగ్రహం కు పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ మూల సాంసృతి పరిరక్షించడానికి వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న భారతీయ సామాజిక,న్యాయ పోరాట ప్రస్తానానికి కొనసాగింపుగా ఆవిర్భవించిన దేశభక్తి యుత విప్లవ విశాల వేదిక” భారతీయ అంబేద్కర్ సేన”( బాస్)అని అన్నారు. 29 న మదనపల్లి పట్టణం లో జరగబోయే భారీ సభలో కుల దహనం కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధాన కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్ రామాంజనేయులు, ఉపాధ్యక్షులు మూడే శంకర్ నాయక్, భారతీయ అంబేద్కర్ సేన నియోజక వర్గ నాయకులు సి రమేష్ బాబు, సి పామయ్య, పి సహదేవ, బి సుధాకర్, పి పవన్ కుమార్, జె చంద్ర మౌళి, సురేంద్రబాబు, జె మహేష్ పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp