మదనపల్లి ; గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాయల్ అరేబియా ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొన్నారు. గ్లోరీ ఫాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా చేతుల మీదుగా ఫ్రాస్టర్స్ కు బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగాలకు ప్రత్యేకగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను ముందస్తుగా నిర్వహిస్తున్న జాన్ బాబు బృందానికి శుభాకాంక్షలు అందజేశారు. మతసామరస్యానికి ప్రత్యేకంగా జరుపుకునే క్రిస్మస్ పండగ అందరికీ శుభాలు కలుగు చేయాలని ఆకాంక్షించారు. క్రైస్తవ పాస్టర్లకు తెలుగుదేశం పార్టీ పాలనలో అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందని, సమాధుల స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్లోరీ ఫాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు జాన్ బాబు, సెక్రటరీ జాన్సన్, కమిటీ సభ్యులు సుధాకర్, జై కుమార్, జాన్సన్, ఎలిసా, సామేలు, సామ్సన్, పెద్ద సంఖ్యలో క్రైస్తవ పాస్టర్లు పాల్గొన్నారు.
